
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ‘నారి నారీ నడుమ మురారి’ టీజర్ వచ్చేసింది. టీజర్ చూస్తే ఈ సంక్రాంతికి అందరూ హాయిగా నవ్వుకోగల చక్కటి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించబోతున్నట్లే అనిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14న ఫస్ట్ షోతో (సాయంత్రం 5.49 గంటలకు) విడుదల కాబోతోంది.
ఈ సినిమాకి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగన, వెంకట స్వామి, బ్రహ్మ కడలి, రామజోగయ్య శాస్త్రి, వంశీ-శేఖర్, తదితరులు ఈ సినిమా టీమ్‌లో ఉన్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.