సంబంధిత వార్తలు

రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘రౌడీ జనార్ధన’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎటువంటి హడావుడీ లేకుండా అప్పుడే రౌడీ జనార్ధన టీజర్ విడుదలకు సిద్దమైపోయింది. ఈ నెల 18న నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్, ప్రసాద్ ఐమాక్స్‌లో విడుదల కాబోతోంది.
రౌడీ జనార్ధనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో డా.రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.