
ప్రముఖ కన్నడ నటుడు డా.శివరాజకుమార్ ప్రధాన పాత్ర చేసిన సినిమా పేరు ’45’. ఈ సినిమాలో ఉపేంద్ర, రాజ్ బిశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమా తెలుగులో అదే పేరుతో జనవరి 1న విడుదల కాబోతోంది.
ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ నటన, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘సమాధి మీద పుట్టిన తేదీ మరణించిన తేదీ వ్రాసి ఉంటుంది. దాని మద్యలో ఉండే చిన్న డాషే జీవితం,’ డైలాగ్ అద్భుతంగా ఉంది.
ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడుగా మారారు. ఈ సినిమాకు కధ, సంగీతం కూడా ఆయనే చేశారు.
ఈ సినిమాకి డైలాగ్స్: అనిల్ కుమార్, కెమెరా: సత్య హెగ్డే, ఎడిటింగ్: కెఎం ప్రకాష్, కోరియోగ్రఫీ:చిన్ని ప్రకాష్, బి ధనంజయ్, స్టంట్స్:డా.రవివర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ, చేతన్ డిసౌజా, ఆర్ట్: మోహన్ పండిత్, విఎఫ్ఎక్స్: యష్ గౌడ చేశారు.
సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి కలిసి నిర్మించారు.