సినిమా షూటింగ్‌లపై ఇండిగో ఎఫెక్ట్!

నేడు దేశవ్యాప్తంగా అనేక ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభావం భారతీయ సినీ పరిశ్రమపై కూడా పడింది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతుంటాయి. కానీ అందరూ షూటింగ్‌ లొకేషన్లలోనే ఉండలేరు. ముఖ్యంగా ప్రధాన నటీ నటులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు పని అవసరాన్ని బట్టి తాము నివసించే నగరాల నుంచి రాకపోకలు రాకపోకలు సాగిస్తుంటారు.

కానీ రెండు మూడు రోజులుగా ఇండిగో విమానాలు రద్దు అవుతుండటంతో వారి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు రాలేకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలలో షూటింగులకు అంతరాయం కలిగింది.

షూటింగ్‌ రద్దు అవడంతో సమయం, డబ్బు వృధా అవుతాయి. ఒకటి రెండు రోజులు విమానాలు ఆలస్యమైనా, రద్దు అయినా షూటింగులు అడ్జస్ట్ చేసుకోగలరు. కానీ ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నటీనటులు,తదితరుల డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. 

తాజా సమాచారం ప్రకారం ఈ సమస్యకు కారణమైన డిజిసీఏ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కనుక ఒకటి రెండు రోజులలోనే ఇండిగో విమానసేవలు యధాప్రకారం కొనసాగవచ్చు.