చివరి నిమిషంలో అఖండ-2 వాయిదా!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ మేరకు ఈ సినీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసింది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది చాలా నిరాశ కలిగిస్తున్నందుకు క్షమించవలసిందిగా కోరింది. అఖండ-2 ఎప్పుడు త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలియజేసింది. ఆర్ధిక లావాదేవాలలో ఏర్పడిన ఓ వివాదం కారణంగా అఖండ-2 వాయిదా పడినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రంలోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.