కల్కి-2లో దీపికా స్థానంలో ప్రియాంకా చొప్రా ?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌ హాసన్‌ వంటి అగ్రనటులు నటించిన ‘కల్కి ఏడీ 2898’ సూపర్ హిట్ అయ్యింది. కనుక రెండో భాగం అప్‌డేట్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో సుమతి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్‌ నటి దీపికా పడుకొనే ఇటీవల ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె తాను రోజుకి 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గోనగలనని చెప్పడంతో అలా షూటింగ్‌ పూర్తి చేయలేమని వైజయంతీ మూవీస్ స్పష్టం చేసింది. తర్వాత ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.

కనుక ఆమె స్థానంలో ఎవరు? అనే ప్రశ్నకు చాలా పేర్లు వినిపించాయి. కానీ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చొప్రా అయితే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇదివరకే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు.

ప్రస్తుతం ఆమె రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న వారణాశిలో నటిస్తున్నారు. కనుక ఆమెను కల్కి-2లో తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కల్కి-2 ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కనుక ఆమెని ఈ సినిమాలో తీసుకుంటున్నారా? లేక మరెవరినైనా తీసుకుంటున్నారా? అనే విషయం త్వరలో తెలుస్తుంది.