
శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో ‘ఈసా’ హర్రర్ చిత్రం సిద్దమవుతోంది. నేడు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ నిజంగానే భయపెడుతుంది. సౌండ్, లైటింగ్ ఎఫెక్ట్ అద్భుతంగా కుదరడంతో ఫస్ట్ గ్లిమ్స్ ఇంపాక్ట్ బలంగా ఉంది.
ఈ సినిమాలో అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృద్విరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: శ్రీనివాస్ మన్నె, సంగీతం: ఆర్ ఆర్ ధృవన్, కెమెరా: సంతోష్ సనమొని, ఎడిటింగ్: వినయ్ రామస్వామి, కోరియోగ్రఫీ: రాము చేస్తున్నారు.
వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పోతుల హేమ, వెంకటేశ్వర రావు కలిసి నిర్మించిన ఈషా ఈనెల 12న విడుదల కాబోతోంది.