
రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో యువహీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి “పొమ్మంటే ...” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదల చేశారు.
చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని హ్యారీస్ జయరాజ్ అద్భుతంగా స్వరపరిచి మధురమైన సంగీతం అందించారు. ఈ విజయ్ దేవరకొండ ఏసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ కలిసి ఈ పాటని అంతే మధురంగా పాడారు.
ఈ సినిమాలో విధి యాదవ్, సముద్ర ఖని, సాయి కుమార్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్:1గా నిర్మిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకి కధ, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, స్టంట్స్: సుప్రీం సుందర్ పృధ్వీ, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి కలిసి నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.