
గత నెలలో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ నిశ్చితార్ధం జరిగినప్పటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారి వివాహం జరుగబోతోందని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇటీవల రష్మిక ఓ హాలీవుడ్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. “నేను ఆ ఊహాగానాలను ఖండించను... అలాగని వ్యతిరేకించను. పెళ్ళి అనేది మా వ్యక్తిగత విషయం. సమయం వచ్చినప్పుడు దాని గురించి నేనే చెపుతాను. ప్రస్తుతానికి ఇంతకు మించి మరేమీ చెప్పలేను,” అని రష్మిక జవాబు చెప్పారు.
ఆమె తన జీవితం, కెరీర్ గురించి మాట్లాడుతూ, నేను రెంటినీ మిక్స్ చేయాడానికి ఇష్టపడను. ఇంట్లో ఉన్నప్పుడు సినిమాల గురించి ఆలోచించను. షూటింగ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో విషయాల గురించి ఆలోచించను, మాట్లాడను. ఒక్కోసారి వివిధ కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతుంది.
కనుక సినిమా సకాలంలో పూర్తి చేయడం ఒక్కోసారి రెండు షిఫ్టులు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. సినిమాలైనా, జీవితమైనా క్రమశిక్షణ, నిబద్దత చాలా అవసరం,” అని రష్మిక అన్నారు.