
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావలసి ఉంది. కానీ సెట్స్ నిర్మాణంలో ఆలస్యం అవడంతో రెండు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఈ కారణంగా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కావలసిన ఈ సినిమా వేసవి సీజన్‌కి వాయిదా పడే అవకాశం ఉంది.
‘ది ప్యారడైజ్’ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్ సిద్దం అయ్యాయి. కనుక నేటి నుంచి మళ్ళీ షూటింగ్ మొదలవబోతోంది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో వేసిన ఈ సెట్స్‌లోనే షూటింగ్ జరుగుతుంది. మద్యలో షూటింగ్ ఆగిపోవడం వలన సినిమా ఆలస్యం అయ్యింది. కనుక దానిని కవర్ చేసేందుకు మార్చి వరకు ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమా పూర్తి చేయాలని శ్రీకాంత్ ఓదెల, నాని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
“చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించే రాసిన్రు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కధ. జమానా జమాన కెళ్ళి నడిచే శవాల కధ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కధ..” అంటూ ఈ సినిమా కధని మొదటే టూకీగా చెప్పేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
ఈ సినిమాలో నానికి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మోహన్ బాబు, కాయడు లోహార్, రాఘవ్ జూయల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.