కోఠీ మహిళా కాలేజీలో స్పిరిట్ షూటింగ్‌

సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్‌, త్రిప్తి దిమ్రీ జంటగా చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌, కోఠీలోని మహిళా కాలేజీలో స్పిరిట్ షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు అక్కడే స్పిరిట్ షూటింగ్‌ జరుగుతుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్ ఒబిరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ; సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; కెమెరా: రాజ్ తోట; యాక్షన్: సుప్రీమ్‌ సుందర్; ఆర్ట్: ఘార్గి ముఖర్జీ చేస్తున్నారు. 

గుల్షన్ కుమార్‌ & టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్‌, క్రిషన్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగ, ప్రభాకర్ రెడ్డి వంగ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషలతో భాషల్లో నిర్మిస్తున్నారు. జపనీస్, కొరియన్ భాషలలో డబ్ చేసి ఆ దేశాలలో విడుదల చేయబోతున్నారు.