ఆంధ్రా కింగ్‌ టాక్ బాగుంది కానీ కలెక్షన్స్.. మైత్రి రవి

మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 27న విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ సినిమా టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం నిరాశ కలిగిస్తున్నాయని నిర్మాత రవిశంకర్ అన్నారు.

అయితే నవంబర్‌ నెలాఖరున సినిమా రిలీజ్ చేసేనప్పుడే వివిధ కారణాల వలన మొదటి వారం రోజులు కలెక్షన్స్ పెద్దగా ఉండకపోవచ్చని అనుకున్నామని చెప్పారు. డిసెంబర్‌ 5న బాలకృష్ణ నటించిన అఖండ-2 విడుదల కాబోతోంది. అది సెటిల్ అయిన తర్వాత తమ ఆంధ్రా కింగ్‌ కలెక్షన్స్ కూడా పుంజుకుంటాయని భావిస్తున్నామన్నారు.

కానీ తమ వంతు ప్రయత్నంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించకపోతే మళ్ళీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాల వైపు వెళ్ళిపోవలసి వస్తుందన్నారు. కనుక ప్రేక్షకులు థియేటర్లలో ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా చూసి తమని ప్రోత్సహించాలని నిర్మాత రవిశంకర్ విజ్ఞప్తి చేశారు.

“చేతులు ఎత్తేసిన సినిమాకైతే ఏం చేయలేము… కానీ అందరూ ‘సినిమా బాగుంది’ అంటున్నారు.

మంచి సినిమాను ఆదరించండి… లేకుంటే మేము కూడా మళ్లీ అవే మాస్ కొట్టుడు సినిమాలు చేయాల్సి వస్తుంది.”

– #MythriRavi | #AndhraKingTaluka pic.twitter.com/Gl8AbMrvdZ
— Whynot Cinemas (@whynotcinemass_) December 2, 2025

video courtesy: why not cinimas)