
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు...’ సంక్రాంతి పండగకి వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్న విక్టరీ వెంకటేష్, చిరంజీవిలపై హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ క్లబ్బులో ఫెస్టివల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. వారిద్దరూ కలిసి చేసిన ఈ పాట ఈ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చిత్ర బృందం చెపుతోంది.
ఇటీవల విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ పాట వైరల్ అయ్యింది. త్వరలోనే రెండో పాట విడుదల చేయబోతున్నాము. అది మీసాల పిల్ల కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో చిరంజీవి తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు,” అని దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల చెప్పారు
ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.