
నాగ చైతన్య, సమంత పరస్పర అంగీకారంతోనే విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత ఇద్దరూ సమానంగా మానసిక, సామాజిక ఒత్తిడి భరించినప్పటికీ, వారిలో సమంత మరికాస్త ఎక్కువ అనుభవించారని చెప్పక తప్పదు. వైవాహిక జీవితంలో ఎదురుదెబ్బ, అనారోగ్యం, వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటం, సోషల్ మీడియా వంటి ఒత్తిళ్ళు ఆమె చాలా ఎదుర్కొన్నారు.
ఇద్దరిలో నాగ చైతన్య త్వరగా కోల్కొని గాడిన పడ్డారు. శోభిత ధూళిపాళని వివాహం చేసుకొని మళ్ళీ జీవితాన్ని గాడిన పెట్టుకున్నారు.
సమంత జీవితం, కెరీర్ రెండూ కూడా ‘ఫ్యామిలీ మ్యాన్-2తోనే గాడిన పడింది. ఆ తర్వాత సిటాడెల్: హన్నీ బన్నీతో మరో హిట్ కొట్టారు. వాటి దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి మొన్న డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో పెళ్ళి చేసుకున్నారు.
వారిద్దరూ నిన్న హైదరాబాద్‌లోని రాజ్ నిడిమోరు ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు సమంతను సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. కనుక ఇప్పుడు ఆమె కెరీర్‌లో, జీవితంలో అండగా రాజ్ నిడిమోరు ఉన్నారు. కనుక సమంత జీవితం కూడా ఇక గాడినపడినట్లే భావించవచ్చు.