ఓ..! సుకుమారి...ఐశ్వర్య రాజేష్!

యువ హీరో తిరువీర్‌, ఐశ్వర్య రాజేష్ జంటగా మొదలుపెట్టిన కొత్త సినిమాకి ‘ఓ..! సుకుమారి’ అని పేరు ఖరారు చేశారు. దీనికి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. దట్టమైన మబ్బులలో లవ్ సింబల్ (హృదయం) దాని మీద కరెంట్ (విద్యుత్‌) సింబల్ వేశారు. దాని కింద చెరువు ఒడ్డున గల ఓ చెట్టుపై పిడుగు పడుతుంటే, కొంతమంది దాని నుంచి దూరంగా పరిగెడుతున్నట్లు చూపారు. కనుక ఇదేదో లవ్ మ్యాటర్‌తో ఊరి జనాలకు పెద్ద షాక్‌ ఇవ్వబోతున్న కధలా ఉంది.   

నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నారు. గత నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించేశారు. 

ఈ సినిమాకి సంగీతం: భరత్ మంచిరాజు; కెమెరా: సిహెచ్ కుషేందర్; ఆర్ట్: తిరుమల ఎం తిరుపతి; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్ చేస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా మహేశ్వర్ రెడ్డి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.