
నేషనల్ క్రష్ రష్మికని అందరూ అందంగానే చూడాలనుకుంటారు. కానీ ఆమె ‘ధామ’ హిందీ చిత్రంలో ఓ ఆత్మగా నటించారు. ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా జంటగా చేశారు.
ఈ సినిమాలో పరేష్ రావాల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రలు చేశారు. హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.200 కోట్లు కలక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ టీవీలోకి వచ్చేసింది.
అయితే ప్రస్తుతం ఉచితంగా చూడలేము. రూ.350 అద్దె చెల్లిస్తే తెలుగు, హిందీ భాషలలో చూడవచ్చు. మరికొన్ని రోజులు ఓపిక పడితే ఈ సినిమాని ఉచితంగానే చూడవచ్చు.
మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో ఇదివరకు వచ్చిన స్త్రీ (2018), భేడియా (2022), స్త్రీ-2 (2024) మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ సిరీస్‌లో 4వ సినిమాగా వస్తున్న ‘ధామ’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.