భర్త మహాశయులకు విజ్ఞప్తి… బెల్లా బెల్లా లిరికల్ వీడియో సాంగ్‌ అవుట్!

కిషోర్‌ తిరుమల- మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘బెల్లా బెల్లా...’ లిరికల్ వీడియో సాంగ్‌ పాట విడుదలైంది. సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నకాష్ అజీజ్, రోహిణి సోర్రత్ కలిసి పాడారు.    

ఈ పాట లిరిక్స్, సంగీతం అంతా రోటీన్. కానీ రవితేజ మాత్రం ఇదే తొలి సినిమా తొలి పాట అన్నట్లు చాలా హుషారుగా డాన్స్ చేశారు.   

ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్‌, సునీల్, సత్య, శుభలేక సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. 

ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసేందుకు వస్తున్నారు.