సంబంధిత వార్తలు

బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో డిసెంబర్ 5న అఖండ-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల టీజర్ విడుదల చేయగా తాజాగా ‘అఖండ హైందవం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
నాగ గురునాధ శర్మ వ్రాసిన ఈ పాటకి తమన్ సంగీతం అందించగా సర్వేపల్లి సిస్టర్స్ అద్భుతంగా ఆలపించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించారు.