నేడు వానర టీజర్‌ విడుదల చేయనున్న మంచు మనోజ్‌

ఇంతకాలం కుటుంబ సమస్యలతో సతమతమైన మంచు మనోజ్‌ మళ్ళీ గాడిన పడినట్లే ఉన్నారు. సినిమాలలో నటిస్తున్నారు. సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ‘వానర’ టీజర్‌ విడుదల చేయబోతున్నారు. అవినాష్ తిరువీధుల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడుగా, నటుడుగా ఇదే అతనికి మొదటి సినిమా. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటించారు. 

ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: సుజాత సిద్దార్థ్, కధ స్క్రీన్ ప్లే: విశ్వజిత్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర వీఎఫ్ఎక్స్‌: మాట్రిక్స్. 

ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ సినిమాస్, వానర సెల్యూలాయిడ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై అవినాష్ బుయని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి కలిసి నిర్మించారు.