విజయ్ దేవరకొండ సినిమాలో ఆర్నాల్డ్ వస్లూ

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా విడి-14 వర్కింగ్ టైటిల్‌తో మొదలవుతున్న సినిమాలో   రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వొస్లూ కూడా చేరారు. బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీనిలో ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటించబోతున్నారు.

ఈ సినిమాకు సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, భూషణ్ కుమార్‌ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

God's Favorite Beast Joining the Sets ❤️‍🔥#VD14 #VijayDeverakonda pic.twitter.com/kCAJDi8wGX
— OBH (@Vasanthcomradee) August 12, 2025