
ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ అనే సినిమాతో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి గిరగిర గింగిరాగిరే... లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. శ్యామల కాకర్ల వ్రాసిన ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా రామ్ చరణ్ మిర్యాల పాడారు. ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్ జంటగా చేశారు.
స్వాతంత్ర్య పోరాటాలు జోరుగా సాగుతున్న సమయంలో ఫుట్ బాల్ ఆట నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఛాంపియన్ టీజర్ అద్భుతంగా ఉంది. కనుక ఛాంపియన్ తప్పకుండా గోల్ కొడతారని భావించవచ్చు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మాదే ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, స్టంట్స్: పీటర్ హెయిన్,చేస్తున్నారు.
స్వప్న సినిమా, ఆనందీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకె మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న చాంపియన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.