శ్రీలీల డాన్సింగ్ క్వీన్ అని ఎందుకంటారంటే...

శ్రీలీల తొలిసారిగా తమిళ సినిమా ‘పరాశక్తి’లో శివ కార్తికేయన్‌కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ్, తెలుగులో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రత్నమాల లిరికల్ వీడియో సాంగ్‌ నేడు విడుదలైంది.

పరాశక్తి అనే పేరు చూసి ఇదేదో భక్తి చిత్రం అనుకోనవసరం లేదు. ఒకప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. కనుక ఇదో చక్కటి పీరియాడికల్ రొమాంటిక్ సినిమా అనుకోవచ్చు.

ఈ పాటకు శ్రీలీల చేసిన డాన్స్ చూస్తే ఆమెను డాన్సింగ్ క్వీన్ అని ఎందుకు అంటారో అర్ధమవుతుంది. చీరతో అంత వేగంగా డాన్స్ చేయడం ఆమెకు చెల్లునేమో అనిపిస్తుంది. 

రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకి జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించి స్వయంగా పాడారు. ఈ సినిమాలో రవిమోహన్, అధర్వ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుధా కొంగర, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: రవి కె చంద్రన్, ఎడిటింగ్:సతీష్ సూర్య, ఆర్ట్: ఎస్. అన్నాదురై, స్టంట్స్: సుప్రీం సుందర్ చేస్తున్నారు. 

రెడ్‌బుక్‌ జయంట్‌ మూవీస్ సమర్పణలో డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై   ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.         

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/fd2LjbJOpHk?si=g_-y5SqOrXfQjTR2" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>