
మాస్ మహరాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ నవంబర్ 1న విడుదలయ్యింది. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉండబట్టే 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. కానీ ఊహించినట్లే బోర్లా పడింది.
ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. సినీ ఇండస్టీ-ఓటీటీ సంస్థలు చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత అంటే ఈ నెల 28న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా ధృవీకరించింది.
సినీ రచయిత భాను భోగవరపు దర్శకుడుగా మారి చేసిన ఈ తొలి ప్రయోగం విఫలం అయ్యిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు.