నాగ చైతన్య-కార్తీక్ సినిమా టైటిల్‌: వృషకర్మ

నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో మొదలుపెట్టిన ‘ట్రెజర్ హంట్’ అడ్వంచర్ పాన్ ఇండియా మూవీకి టైటిల్‌ ‘వృషకర్మ’ అని ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. టైటిల్‌ పోస్టర్లో నాగ చైతన్య ‘రఫ్ అండ్ టఫ్’గా ఉన్నారు.  ‘వృషకర్మ’ అంటే కార్యసాధకుడు అని అర్ధం.    

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. యువ హిందీ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్)ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.