
నాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’లో అయన కొడుకుగా నటించి మెప్పించిన క్యూట్ బాయ్ హరీష్ కళ్యాణ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు... హీరో అయ్యాడు. వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తీస్తున్న ‘దాషమకాన్’లో హీరోగా నటిస్తున్నాడు. నిన్న విడుదలైన ప్రమోలో కండలు తిరిగిన శరీరంతో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్న హరీష్ కళ్యాణ్‌ని చూసినప్పుడు, జెర్సీలో క్యూట్ బాయ్ ఇతనేనా? అని సందేహం కలుగుతుంది.
చెన్నై శివారులో ‘దాషమకాన్’ అనే ప్రాంతంలో ఓ పబ్లిక్ టాయిలెట్‌లో హీరోని చంపేందుకు ఓ రౌడీ గ్యాంగ్ వస్తే వారినే వేసేసి కూల్‌గా చేతులు కడుకొని వెళ్ళిపోతున్నట్లు ప్రమోలో చూపారు. తర్వాత తమిళ వాసనతో తెలుగులో ఓ మాస్ బీట్ సాంగ్ వేసి ప్రమో ముగించారు.
‘కన్నప్ప’ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్‌కి జోడీగా నటిస్తోంది. సత్యరాజ్, సునీల్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: వినీత్ వరప్రసాద్, సంగీతం: బ్రిట్టొ మైఖేల్, కెమెరా:కార్తీక్ అశోకన్, ఎడిటింగ్: జి.మదన్, ఆర్ట్: మనిమోజియాన్ రామదురై, స్టంట్స్: ఓం ప్రకాష్ చేస్తున్నారు.
థింక్ స్టూడియోస్, ఐడా ప్రొడక్షన్స్ బ్యానర్లపై వినీత్ వరప్రసాద్ ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.