
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావిపూడి కామెడీ ఎలా ఉంటుందో రుచి చూపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కామెడీ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి డజన్ల కొద్దీ సినిమాలు ఉన్నాయి.
అలాంటి మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు... అని సినిమా టైటిల్ ‘మన శంకరవరప్రసాద్ గారు...’ పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు. కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట ‘మీసాల పిల్ల’ వదిలారు, అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు. ఈ నెలాఖరులోగా రెండో పాట వచ్చేస్తుందని సమాచారం.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. రెండో హీరోయిన్‌గా క్యాథరిన్ చేయబోతునట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి వెంకటేష్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మన శంకర వరప్రసాద్ గారితో పాటు హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.