
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలయ్యింది.
ఇదో కమర్షియల్ సినిమా. కనుక ఫ్యామిలీ డ్రామాతో ట్రైలర్ మొదలుపెట్టి దేశభక్తి, భారత్‌ని కబళించేందుకు విదేశీయులు చేసే కుట్రలు, క్షుద్రశక్తులు, సరిహద్దు వద్ద అఘోర ఒంటి చేత్తో వందల మందితో పోరాటాలతో ట్రైలర్ నింపేశారు. బాలయ్య చేత సనాతన ధర్మం డైలాగులతో ట్రైలర్ ముగించారు.
మూడు రోజుల క్రితమే ‘జాజికాయ జాజికాయ..’ అంటూ ఓ పాటేసుకున్నారు కనుక మాస్ మసాలా చిత్రానికి ఉండాల్సిన హంగులన్నీ అఖండ-2లో ఉన్నట్లే!
తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆంధ్రాలో బాలయ్య అభిమానులకు ఇవన్నీ అలవాటే. కనుక అఖండ-2 చూసి ఆనందిస్తారేమో కానీ ఉత్తరాది ప్రేక్షకులు బాలయ్య-బోయపాటిల హడావుడిని అర్ధం చేసుకోగలరో లేదో సినిమా విడుదలైతే తెలుస్తుంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించి డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు.