
రాజమౌళి దేవుడు-భక్తి-హనుమంతుడు గురించి చేసిన చిన్న వ్యాఖ్యలతో ఎంత రాద్దాంతం జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.
ఇది చాలా సున్నితమైన అంశం కావడం, రాజకీయాలతో కనెక్ట్ అవడంతో వారణాశిలో అగ్రనటీనటులతో సహా సినీ పరిశ్రమలో ఏ ఒక్కరూ రాజమౌళికి బాసటగా నిలబడలేదు.
కానీ ఇలాంటి వివాదాలకు ఏమాత్రం బెదరని రాంగోపాల్ వర్మ మాత్రం విమర్శకులకు చాలా ఘాటుగా బదులిచ్చారు. సోషల్ మీడియాలో ఆయనో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
భక్తులమంటూ ఇప్పుడు రాజమౌళిగారిపై విషం కక్కుతున్నవారిని చూస్తుంటే… వారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి: భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక హక్కే.
అందువల్ల ఆయనకు దేవుడిని నమ్మనని చెప్పే హక్కు ఎంతుందో… వాళ్లకు దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు కూడా అంతే.
ఇప్పుడు ఆ మూర్ఖపు వాదన గురించి చర్చిద్దాం. “దేవుడ్ని నమ్మకపోతే ఆయన సినిమాల్లో దేవుళ్ళని ఎందుకు చూపుతున్నాడు?” అని అడుగుతున్నారు. అదే లాజిక్ అయితే, గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దర్శకుడు పిశాచం అవ్వాలా?
ఇక అసలు షాక్ ఏమిటంటే?, ఆయన దేవుడిని నమ్మకపోయినా… దేవుడు ఆయనకీ చాలా మంది అభిమానులను, వెయ్యి జన్మలు ఎత్తినా దక్కని వంద రెట్లు ఎక్కువ విజయం, ధనం, అభిమానం ఇచ్చేశాడు.
దీనర్థం ఏమిటి?
1. దేవుడు నాస్తికులను భక్తుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా?
2. లేదా దేవుడికి అసలు పట్టించుకోవడమే లేదా?
3. లేదా… దేవుడు అక్కడ కూర్చొని ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నమ్మడం లేదు అని నోట్‌బుక్‌లో రాస్తూ ఉండడా?
దేవుడికి ఆయన మీద ఏ సమస్యా లేకపోతే… ఈ స్వయంఘోషిత “దేవుడి జవాన్లు” ఎందుకు బీపీ, అల్సర్లు తెచ్చుకుంటున్నారు?
కాబట్టి అసలు సమస్య ఆయన నాస్తికత్వం కాదు.
అసలు సమస్య ఏమిటంటే—
అతను దేవుడిని నమ్మకపోయినా విజయం శిఖరాలను అందుకున్నాడు…
కానీ దేవుడిని నమ్మి కూడా జీవితంలో ఏమీ సాధించలేని వాళ్లు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
దేవుడిని కాపాడుతున్నామనుకోవడం ఆపేయాలి.
అలా చెయ్యడం దేవుడినే అవమానించినట్టే
మన రక్షణ అవసరమయ్యేంత బలహీనుడు ఆయన కాదు.
రాజమౌళి గారు నాస్తికుడని చెప్పినా దేవుడు తగ్గిపోవడంలేదు.
కేవలం భక్తి ఒక్కరు నమ్మడం మానేస్తే హిందూమతం కూలిపోతుందని భయపడుతున్న అభద్రతా భావం గల భక్తుల అసలైన స్వభావం బయటపడుతోంది అంతే.
కాబట్టి రిలాక్స్.
దేవుడు బాగానే ఉన్నాడు.
రాజమౌళి గారు కూడా బాగానే ఉన్నారు.
బాగోలేని వాళ్లు ఎవరంటే వాళ్ళిద్దరినీ అర్థం చేసుకోలేనివారే!
కాబట్టి రాజమౌళిగారి అదృష్టమనే ఖాతా ఇప్పటికే నిండిపోయింది. వారణాశి ద్వారా దేవుడు దానిని మరింత నింపుతున్నాడు. అది చూసి అసూయతో మండిపోతున్న “ఓడిపోయినవాళ్ళు” మాత్రం ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు.
బాటమ్ లైన్: ఇది పరమ అసూయ… భక్తి రూపం వేసుకుని నటిస్తున్న అసూయ!
జై హనుమాన్!
In the context of all the venom being spewed by the so called believers on @ssrajamouli they should know that being an atheist in India is not a crime . Article 25 of the Constitution protects the right to not believe
So he has every right to say he doesn’t believe as much as the…