
బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మొన్న ‘జాజికాయ, జాజికాయ... అంటూ సాగే రెండో పాటని విశాఖలో విడుదల చేశారు.
ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పని పూర్తి చేశాను... ఇక ట్రైలర్ విడుదల చేయడమే ఆలస్యం అంటూ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ ట్వీట్ చేశారు.
కర్ణాటకలోని చిక్ బల్లాపూర్‌లో ఈరోజు (శుక్రవారం) రాత్రి 7.56 గంటలకు అఖండ-2 ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరుగబోతోందని తెలియజేస్తూ పోస్టర్ వేశారు. ఈ కార్యక్రమానికి డా.శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.
బోయపాటి సినిమా అంటేనే మాస్ మసాలా చిత్రం. మొన్న విడుదల చేసిన జాజికాయ పాటతో అది ధృవీకరించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించి డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు.