నాగ చైతన్య-కార్తీక్‌ దండు ఎన్‌సీ-24 మేకింగ్ వీడియో

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఎన్‌సీ-24 వర్కింగ్ టైటిల్‌తో ఓ అడ్వంచర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. షూటింగ్ కోసం సెట్స్‌ ఏవిదంగా తయారుచేస్తారు? స్టంట్స్ ఏవిదంగా ఘాట్ చేస్తారనేది ఈ మేకింగ్ వీడియోలో చూపారు. దీనిలో వేసిన సెట్స్‌, చేసిన స్టంట్స్ చూస్తే సినిమా అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. 

ఈ నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే టైటిల్‌ ప్రకటించి ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయనున్నారు. అప్పుడే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించవచ్చు.