
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో ఓ యావరేజ్ హీరో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోని రేపు బేతాళుడుగా రాబోతున్నాడు. అయితే సినిమా రిలీజ్ నెల ఉందగానే 10 నిమిషాల సీన్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన విజయ్ ఇప్పుడు రేపు రిలీజ్ అనగా మరో 5 నిమిషాల సినిమాను అఫిషియల్ గా వదిలారు. అంతేకాదు సినిమాలో మూడు సాంగ్స్ ఫుల్ వీడియోలను కూడా రిలీజ్ చేశారు. బిచ్చగాడుతో వచ్చిన క్రేజ్ ను సరిగ్గా వాడుకోవాలనే ఉద్దేశంతో బేతాళుడుతో ఈ వెరైటీ ట్రిక్ ప్లే చేస్తున్నాడు విజయ్ ఆంటోని.
సినిమా మీద తనకున్న నమ్మకం ప్రేక్షకుల్లో కూడా కలిగేలా సినిమాలోని చాలా ప్రాముఖ్యత పొందిన సీన్స్ లీక్ చేసి అంచనాలను పెంచేశాడు విజయ్. అది కూడా రిలీజ్ రేపు అనగా ఈ 5 మినిట్స్ సీన్ కూడా వదలడం ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చెప్పొచ్చు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఇదవరకు నటించిన నకిలి, డాక్టర్ సలీం సినిమాలను యూట్యూబ్ లో అరగదీసేలా చూశారు తెలుగు ప్రేక్షకులు. సో ఇదంతా చూస్తుంటే బిచ్చగాడిలానే బేతాళుడు కూడా మంచి హిట్ సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రదీప్ కృష్ణమూరి డైరక్షన్లో వస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే పావుగంట సినిమా వదిలి తన కాన్ ఫిడెన్స్ లెవల్ ఏంటో చూపించాడు విజయ్. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.