
బాలీవుడ్ కండల వీరుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఏ హీరోయిన్ తో ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పడం కష్టం.. వయసు మీద పడుతున్నా సరే బ్యాచిలర్ అన్న ఒకే ఒక్క మాట మీద సినిమాలో చేస్తున్న ప్రతి హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తాడని సల్మాన్ మీద రూమర్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ రుమేనియా భామ లులియాతో ప్రేమలో ఉన్నాడని తెలిసిందే. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని మీడియా టాక్. అయితే ఈలోపే సల్మాన్ చాన్స్ ఇస్తే తనతో డేటింగ్ చేసేందుకు నేను రెడీ అంటుంది ఇంగ్లీష్ భామ ఎమీ జాక్సన్.
సల్మాన్ తో నటించిన ఈ అమ్మడు తనతో డేట్ చేయమని అడగాలే కాని వెంటనే ఒప్పేసుకుంటా అని అంటుంది. అయినా అంత అదృష్టం నాకు లేదని వెరైటీగా స్పందించింది ఈ హాట్ బ్యూటీ. ఇద్దరి మధ్య ఎఫైర్స్ మీద వస్తున్న వార్తలను ఖండించడం మానేసి ఇలా రివర్స్ కౌంటర్ ఇస్తుంది అంటే అమ్మడి ఇంటెన్షన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న ప్రీకీ ఆలి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఎమీ జాక్సన్ సల్మాన్ తో ముడిపెడుతున్న తన గురించి పైవిధంగా స్పందించి అందరి నోళ్లు మూయించేసింది.