మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమాలో మంగళవారంతో ఆయన చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. సరిగ్గా 23 ఏళ్ళ క్రితం ప్రభాస్ నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’ కూడా సరిగ్గా ఇదే రోజున విడుదలైంది.
కనుక ప్రభాస్‌కు అభినందనలు తెలుపుతూ ఓ పోస్టర్ పెట్టారు. 23 ఏళ్ళలో అనేక బాక్సాఫీస్ హిట్స్ అందించిన ప్రభాస్ జనవరి 9న రాజాసాబ్‌తో పాత రికార్డులన్నీ తిరగ రాయబోతున్నారని దానిలో పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ రాజాసాబ్‌పై అంచనాలు భారీగా పెంచేసింది. మారుతి మార్క్ హర్రర్ కామెడీ, ప్రభాస్ టైమింగ్ సరిగ్గా సెట్ అయితే ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

It’s 23 years of rewriting box office history of turning every Friday into a festival ❤️🔥

All these years were one thing.
On January 9th, you’ll witness something new. 🔥

All hail THE REBELWOOD 👑#23YearsForRebelWood #Prabhas #TheRajaSaab pic.twitter.com/lV0zxsQ06T
— The RajaSaab (@rajasaabmovie) November 11, 2025