
మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నెంబర్ 150 సంక్రాంతి టార్గెట్ తో రెడీ అవుతుంది. వినాయక్ డైరక్షన్ లో తమిళ మూవీ కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తర్వాత చిరు 151వ సినిమా బోయపాటి శ్రీనుతో ఆల్రెడీ కన్ఫాం అనేస్తున్నారు. ఇక ఈమధ్యనే మెగాస్టార్ తో త్రివిక్రం శ్రీనివాస్ రెండు గంటల పాటు సుధీర్ఘమైన చర్చలు జరిపారట. చిరు 152వ సినిమా త్రివిక్రంతో చేసే ఆలోచనతోనే ఈ డిస్కషన్స్ చేసినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ త్రివిక్రం అహా వాట్ ఏ కాంబినేషన్.. అయితే ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మిస్తారట.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద ఈ సినిమా నిర్మించాలని చూస్తున్నారట. ఇదంతా నిజమే అయితే ఇక సినిమా సంచలనాలు షురూ చేయడం ఖాయం. ప్రస్తుతం ఖైది సినిమాతో చిరు, పవర్ స్టార్ సినిమాతో త్రివిక్రం ఇద్దరు బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి చేశాక కాని వీరి ప్రాజెక్ట్ మీద ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. పవన్ నిర్మాణంలో రాం చరణ్ సినిమా ఉంటుంది అనుకుంటే సడెన్ గా చిరుని లైన్లో తెచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు త్రివిక్రం శ్రీనివాస్.