
టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క పెళ్లికి సిద్ధమవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్ని పూర్తి చేశాక అనుష్క పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అనుష్కను ఓ బిజినెస్ మేన్ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట అనుష్క తన ఫ్యామిలీకి దగ్గరైన ఒక బెంగుళూరు బిజినెస్ మేన్ తో పెళ్లికి రెడీ అవుతుందని అంటున్నారు.
ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అతను తన కుటుంబానికి నచ్చడంతో ఇక పెళ్లి బాజాలు మోగించడమే తరువాయట. స్వీటీ నటిస్తున్న సింగం ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అయ్యింది ఇక బాహుబలి-2 కు తన పోర్షన్ కంప్లీట్ చేసుకుంది ఎటుకూడి తను లీడ్ రోల్ చేస్తున్న భాగమతితో పాటుగా రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేస్తున్న ఓం నమో వెంకటేశాయలో అనుష్క నటించాల్సి ఉంది. అవి కూడా పూర్తి చేసుకుంటే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతుందట అనుష్క. తన ఫ్యాన్స్ కు ఇదో చేదు వార్త అయినా అమ్మడికి ఇప్పటికే 34 ఏళ్లు రావడంతో పెళ్లి మీద ఫైనల్ నిర్ణయం తీసుకుందట. సో త్వరలోనే అనుష్క పెళ్లి న్యూస్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట.