శివోహం లిరికల్ వీడియో సాంగ్‌

వంశీకృష్ణ మల్ల దర్శకత్వంలో హర్ష, అనురూప్, ఇనన్య సుల్తానా, లతా రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేసిన ‘మదం’ టీజర్‌ అక్టోబర్‌ 31న విడుదల కాగా నేడు కార్తీకపౌర్ణమి సందర్భంగా శివోహం అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఓ మారుమూల గ్రామంలో అడవులను నమ్ముకుని జీవించే గ్రామీణులు పోలీసుల చేతిలో ఏవిదంగా నరకం అనుభవిస్తుంటారో ఈ సినిమాలో చూపారు. కనుక ఈ సినిమాకి ‘మదం’ అనే పేరు చక్కగా సరిపోతుంది. 

దర్శకుడు వంశీకృష్ణ వ్రాసిన శివోహం అనే ఈపాటకి డావ్జండ్ సంగీతం అందించగా దాసరి మేఘన నాయుడు, డావ్జండ్ కలిసి పాడారు. 

ఈ సినిమాకి కధ: రమేష్ బాబు కోయ,  సంగీతం: డావ్జండ్, కెమెరా: రవికుమార్ వి, ఎడిటింగ్: నందమూరి తారక రామారావు చేస్తున్నారు.      

అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో ఏకైవ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్, రమేష్ బాబు కోయ కలిసి ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్నారు.