సౌత్ క్వీన్ తమన్నా..అంత సీన్ ఉందంటారా..!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీలో క్వీన్ ఒకటి. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కంగనా రనౌత్ తన నట విశ్వరూపాన్ని చూపించింది. అయితే ఈ సినిమాను సౌత్ కు తెచ్చేందుకు త్యాగరాజన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. తెలుగు తమిళ భాషల్లో నిర్మించబడుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నట్టు టాక్. సౌత్ క్వీన్ గా తమన్నా ఓకే అయితే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. కంగనాకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన క్వీన్ రీమేక్ లో తమన్నా అంటే లక్కీ ఆఫర్ అనే చెప్పాలి.

ఏమాటకామాట చెప్పాలంటే కంగనా రనౌత్ లాగా తమన్నా నటిస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం బాహుబలి తప్ప చేతిలో సినిమాలేవి లేని మిల్కీ బ్యూటీకి ఈ క్వీన్ ఆఫర్ తో మరోసారి క్రేజ్ సంపాదించిపెడుతుందని చెప్పొచ్చు. తమిళంలో రేవతి, తెలుగులో సుహాసిని డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్న ఈ సినిమా తమన్నా ఎలాంటి అభినయం కనబరుస్తుందో అని అందరు ఎక్సయిటింగ్ గా ఉన్నారు.  

అభినేత్రిగా పర్వాలేదు అనిపించుకున్న తమన్నా ఆ సినిమా చేయబట్టే ఈ క్వీన్ ఆఫర్ దక్కిందని అంటున్నారు. ఏది ఏమైనా కెరియర్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్న తమన్నాకు ఈ అవకాశం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.