
సౌత్ సూపర్ బ్యూటీ రెజినా ఆన్ స్క్రీన్ ఎంతటి ఫాలోయింగ్ ఏర్పరచుకుందో ఆఫ్ స్క్రీన్ కూడా అదే రేంజ్ రూమర్స్ అమ్మడి చుట్టూ తిరుగుతుంటాయి. సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ అంటూ ఇలా తను చేసే ప్రతి సినిమాలో హీరోతో గాసిప్పులను ఏర్పరచుకునే అమ్మడు రోజు నిద్రపోయేప్పుడు మాత్రం పిల్లోని హగ్ చేసుకుని పడుకుంటుందట. అదేంటి అంటే కొందరు పువ్వులు.. మరికొందరేమో తమ పెట్స్ ను కౌగిలించుకుని పడుకోవడం అలవాటు.. అయితే రెజినాకు మాత్రం తనకు ఎప్పటినుండో పిల్లోని వాటేసుకుని పడుకోవడం అలవాటట.
అలా చేయకుండా నిద్ర పోవడం కూడా కష్టమే అని చెప్పుకొచ్చింది. ఇక తన మీద వచ్చే రూమర్స్ ఏవి తన చెవికి చేరవని.. ఎవరు ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా రాసిన జరిగేదే జరుగుతుంది కాని తన మీద వాటి ప్రభావం ఉండదు అంటుంది రెజినా. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకున్నా ఇంకా స్టార్స్ సినిమాలకు దూరంగా ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న రెజినా త్వరలోనే స్టార్స్ తో కూడా నటించాలని కోరుకుందాం.