వామ్మో ఇదేం ప్రీ లుక్..!

నటుడిగా దర్శకుడిగా సూపర్ ఫాంలో ఉన్న అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా సోగ్గాడు. బాలీవుడ్ హంటర్ మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇక్కడ కూడా అదే అడల్ట్ కంటెంట్ తో రాబోతుంది. మిస్తి చక్రవర్తి, శ్రీముఖి, తేజశ్వి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీలుక్ రిలీజ్ చేశారు. అమ్మాయి పెదాలను కొరుకుతూ వదిలిన ఈ లుక్ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. పోస్టర్ తోనే ఓ రేంజ్ పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్నారు. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. 

అయితే పోస్టర్ తో సినిమా కంటెంట్ ఏ రేంజ్లో ఉండబోతుందో చూపించారు. నటుడిగా దర్శకుడిగా సూపర్ సక్సెస్ లతో దూసుకెళ్తున్న శ్రీని లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేస్తుందట. బీ టౌన్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సాధారణంగా తెలుగులో ఇలాంటి సినిమాలకు స్కోప్ ఉన్నా అంతగా ప్రభావితం చూపించవు అయితే బాలీవుడ్లో సంచనలనాలను సృష్టించిన హంటర్ మూవీ సోగ్గాడిగా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.