
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేయబోయే సినిమా ఏదై ఉంటుందా అన్న కన్ ఫ్యూజన్ కు దాదాపు తెర పడినట్టే అని తెలుస్తుంది. పూరి నుండి త్రివిక్రం దాకా అందరి దర్శకులతో చర్చలు జరిపిన తారక్ ఫైనల్ గా పవర్ డైరక్టర్ కె.ఎస్.రవింద్ర (బాబి)ని సెలెక్ట్ చేశాడని అంటున్నారు. రచయిత అయిన బాబి దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం పవర్ సూపర్ సక్సెస్ అవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కు అవకాశం ఇచ్చాడు.
ఇక ఆ సినిమా మొత్తం పవన్ పర్యవేక్షణలోనే చేయడంతో సినిమా బాబికి ఫ్లాప్ తెచ్చిపెట్టింది. ఇక మళ్లీ తన స్టామినా ఏంటో తెలిసేలా అద్భుతమైన కథ సిద్ధం చేసుకుని వచ్చాడు బాబి. జూనియర్ ను కలిసి కథ చెప్పగా వారెవా అనేశాడట. ఇన్నాళ్లు ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నా అంటూ బాబి కథకు ఓకే చెప్పేశాడట.
ఇక త్వరలోనే అధికారికంగా ఎనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడి కూడా తారక్ ను ఇంప్రెస్ చేసినా కథలో ఇంకాస్త లోపాలున్నాయనడంతో మరో కథతో కలుస్తా అని చెప్పి వెళ్లాడట. సో మొత్తానికి పవర్ స్టార్ తో ఫ్లాప్ వచ్చినా తారక్ పిలిచి మరి బాబికి అవకాశమిస్తున్నాడు. వచ్చిన ఈ అవకాశాన్ని బాబి ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.