అల్లరి నరేష్ సినిమాకి నాగ చైతన్య క్లాప్

అల్లరి నరేష్ 65వ సినిమాకి నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పూజా కార్యక్రమం జరిగింది. వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమం జరుగవలసి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. దర్శకుడు హరీష్ శంకర్, నాగ చైతన్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగ చైతన్య అల్లరి నరేష్‌పై క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. 

ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ సంస్థ కలిసి నిర్మించబోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, సినిమా టైటిల్‌ వగైరా త్వరలోనే ప్రకటిస్తారు.