అమెజాన్ ప్రైమ్‌లోకి కూలీ....

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమాగా ఆగస్ట్ 14న వచ్చిన కూలీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చేస్తోంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో ఒకేసారి అమెజాన్ ప్రైమ్‌ వీడియో లో ప్రసారమవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. అయితే హిందీ వెర్షన్ ఎప్పుడు ప్రసారమవుతుందో ఇంకా ప్రకటించలేదు. బహుశః వేరే ఓటీటీలో ప్రసారమవుతుందేమో?    

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రుతీహాసన్, నాగార్జున, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు చేయాగా, పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌ చేశారు. 

రూ.230 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు కధ: లోకేశ్ కనగరాజ్, డైలాగ్స్: చంద్ర అంబజగన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: గిరీష్ గోవర్ధన్, ఎడిటింగ్: ఫీలోమిన్ రాజ్ చేశారు.