
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్ర చేసిన ‘ఘాటి’ రేపు (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘ఘాటి’ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు అనుష్క పట్ల ప్రత్యేకాభిమానంతో ప్రభాస్ రావడం విశేషమే. గ్లిమ్స్‌లో “వాళ్ళూరుకోరు.... వీళ్ళూరుకోరు... అంటే నేనూరుకోను...” అంటూ అనుష్క చెప్పిన డైలాగ్ ‘ఘాటి’లో ఆమె క్యారక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఒక్క ముక్కలో స్పష్టం చేసింది. ఇక అనుష్క యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు.
సాధారణ జీవితం గడుపుతున్న ఓ మహిళ ‘ఘాటి’ తుపాకులు పట్టి తిరుగుబాటు పోరాటాలు ఎందుకు చేయవలసి వచ్చిందనేది ‘ఘాటి’ కధ. ‘ఘాటి’ ఫస్ట్-లుక్ పోస్టర్లోనే ‘విక్టిమ్, క్రిమినల్, లెజెండ్’ అనే ట్యాగ్ లైన్ జోడించడం ద్వారా దర్శకుడు క్రిష్ కధని మూడు ముక్కలో చెప్పేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కధ: చింతకింది శ్రీనివాసరావు, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, యాక్షన్: రామ్ కృషన్, ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు చేశారు.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫైన్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. సెప్టెంబర్ 5న ఘాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.