
తాజాగా ఓ తమిళ దర్శకుడు చేసిన హాట్ కామెంట్ టాలీవుడ్ లో ప్రకంపణలు రేపింది. సింగం సీక్వల్స్ లో సూపర్ అనిపించుకున్న తమిళ దర్శకుడు హరి తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో తీస్తాడని రూమర్ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఎస్-3 ప్రమోషన్స్ లో పాల్గొన్న హరి తారక్ గురించి అడుగ్గా అతనెవరో తనకు తెలియదు అన్నట్టు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ వెనుక పెద్ద కథ జరిగిందని టాక్. తన తర్వాత సినిమా వేటలో ఉన్న జూనియర్ కు హరి ఓ కథ వినిపించడానికి ప్రయత్నాలు చేశాడట. కనీసం కథ వినడానికి కూడా ఎన్.టి.ఆర్ ఇంట్రెస్ట్ చూపలేదో.. లేక కథ విని నచ్చలేదు అని చెప్పాడో కాని ఆ కోపంతోనే టాలీవుడ్ స్టార్ హీరోని ఎవరో తెలియదు అనేశాడు కోలీవుడ్ డైరక్టర్ హరి.
మరి తన సినిమాలను ఇక్కడకు డబ్ చేసి రిలీజ్ చేస్తూ.. ఇక్కడ స్టార్ హీరో ఎవరెవరో వారి స్టామినా ఏంటో తెలియకుండానే ఉందా అని అందరు హరి విషయంలో తప్పు చూపిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అన్న కామెంట్ కు సరైన క్లారిటీ ఇవ్వకపోతే ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా రిజల్ట్ మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎస్-3 తెలుగు ఆడియోలో ఎన్టీఆర్ గురించి హరి మాట్లాడతాడని అంటున్నారు. ఏది ఏమైనా హరి తొందరపాటు వల్ల సూర్య సినిమాకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయని చెప్పాలి.