
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా హారీస్ జైరాజ్ పనిచేస్తున్నారు. ఇక మహేష్ చేయబోయే కొరటాల శివ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యాడు. మరి తమన్ మహేష్ కాంబోలో సినిమా ఏది అంటే అది తెలియదు కాని ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ చేయబోయే వంశీ పైడిపల్లి సినిమాకు గాని.. ఆ తర్వాత తీసే పూరి జగన్నాథ్ సినిమాకు గాని తమన్ మ్యూజిక్ అందిస్తాడట. దాదాపు వంశీ పైడిపల్లి సినిమాకే తమన్ మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఇప్పటికే మహేష్ దూకుడు,. బిజినెస్ మేన్ సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్ మహేష్ కెరియర్ లో మ్యూజికల్ హిట్స్ అందించాడు. ఇక ఓ పక్క స్టార్ హీరోల సినిమాలను చేస్తూనే చిన్న సినిమాల మీద దృష్టి పెట్టిన తమన్ తన మార్క్ మ్యూజిక్ తో అలరిస్తున్నాడు. ఇప్పటికే పిల్లజమిందార్ అశోక్ డైరక్షన్లో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చూస్తుంటే మరోసారి తమన్ తన మ్యూజిక్ తో వచ్చే సంవత్సరం హుశారెత్తించేలా ఉన్నాడని చెప్పొచ్చు.
మహేష్ తో ఏ సినిమా చేస్తాడో తెలియదు కాని మహేష్ సినిమా మాత్రం కన్ఫాం చేశాడు తమన్. ఇక అంతేనా పవర్ స్టార్ నేసన్ డైరక్షన్లో మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే. మొత్తానికి ఈమధ్య కాస్త డల్ అయిన తమన్ మళ్లీ ఈ అవకాశాలతో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.