
మంచు విష్ణు హీరోగా రాజ్ కిరణ్ డైరక్షన్లో వస్తున్న సినిమా లక్కున్నోడు. విష్ణు సరసన హాన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసింది. అయితే ఈ క్రమంలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు కూడా నోట్ల రద్దు కష్టాలు మొదలయ్యాయని టాక్. సినిమాలో హీరో క్యారక్టర్ డబ్బు సంపాదించే క్రమంలో కొన్ని సీన్స్ ఉన్నాయట. అవి మొత్తం పాత 500, 1000 నోట్లతో పెట్టారట.
తీరా సినిమా రిలీజ్ అయ్యే టైంకు అవి చెల్లని కాగితాలే అయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెల్లని నోట్లకు హీరో పడే సీరియస్ కష్టాలు కూడా కామెడీగా అనిపించే ఛాన్స్ ఉంది. అందుకే ఆ సీన్స్ రీషూట్స్ చేయబోతున్నారట చిత్రయూనిట్. పాత నోట్ల బదులు కొత్త నోట్లను రీప్లేస్ చేస్తున్నారట. అంతేకాదు కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ తో మార్చేస్తున్నారని తెలుస్తుంది. సో మొత్తానికి మోది చేసిన ఈ పనికి సినిమా వాళ్లు ఈవిధంగా కూడా కష్టాలు పడాల్సి వస్తుంది.