
రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఐ ఆనంద్ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా సినిమా ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అయితే హిట్ జోష్ లో ఉన్నాడు కాబట్టి శిరీష్ కూడా ఈ సినిమా మీద నమ్మకంతో ఉన్నాడట. ఇక చిక్కు ఎక్కడ వచ్చి పడ్డది అంటే ఈ సినిమా బడ్జెట్ లోనే అని తెలుస్తుంది.
అంచనాలకు మించి విఐ ఆనంద్ ఈ సినిమా బడ్జెట్ లెక్కేశాడట. శిరీష్ మార్కెట్ దృష్ట్యా అంత వర్క్ అవుట్ అవుతుందా అన్న ఆలోచన చేసిన నిర్మాత చక్రి చిగురుపాటి ముందు సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. కాని ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ కొట్టేసరికి ఆనంద్ టేకింగ్ మీద కూడా పూర్తి నమ్మకం వచ్చేసింది దర్శక నిర్మాతలకు. అందుకే విఐ ఆనంద్ అడిగిన బడ్జెట్ కేటాయించేందుకు నిర్మాత ఓకే చెప్పాడట.
నిఖిల్ సినిమా హిట్ తన ప్రతిభ చూపించడమే కాకుండా నిర్మాతలకు తన మీద ఓ గట్టి నమ్మకం వచ్చేలా చేసుకున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే అల్లు శిరీష్ తో తీసే సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ కథ అని తెలుస్తుంది. సో విఐ ఆనంద్ పరిశ్రమలో తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకునేందుకు తన ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు.