ఎన్టీఆర్ ను బీట్ చేసిన చెర్రి..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో మైఒల్ స్టోన్ మూవీగా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమా ఎని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ క్రమంలో తారక్ ట్రైలర్ తో కూడా అదరగొట్టాడు. జనతా గ్యారేజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన 10 గంటల్లోనే మిలియన్ మార్క్ వ్యూయర్స్ సంపాదించింది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్లో క్రేజీ రికార్డ్ అయిన దీన్ని చరణ్ ధ్రువ అలవోకగా క్రాస్ చేశాడు.

తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ధ్రువ సినిమా ట్రైలర్ అంచనాలను మించి ఉందంటే నమ్మాలి. చరణ్ స్టైల్.. రకుల్ గ్రేస్.. అరవింద్ స్వామి విలనిజం ఇవన్ని సినిమాకు ప్లస్ అవనున్నాయి. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ట్రైలర్ తోనే హిట్ గ్యారెంటీ అన్న ఇండికేషన్ వచ్చినట్టు కనిపిస్తుంది. కేవలం నాలుగు గంటల్లోనే మిలియన్ మార్క్ టచ్ చేసింది అంటే ఇక రిలీజ్ తరవాత సినిమా కలక్షన్ల సునామి సృష్టిస్తుందేమో చూడాలి.