ఓజీ.. నుంచి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్మ్

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ’ నుంచి మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఫైర్ స్టార్మ్ పేరుతో విశ్వ, శ్రీనివాస మౌళి వ్రాసిన ఈ పాటకి థమన్ సంగీతం అందించగా, ఇంగ్లీషులో రాజ కుమారి, జపనీస్ భాషలో అద్వితీయ ఒజ్జల లిరిక్స్ అందించారు. ఈ పాటని సంగీత దర్శకుడు తమన్, నజీరుద్దీన్, భారతిరాజ్, సైలంభరన్, దీపక్ బ్లూ కలిసి పాడారు. ఇది సుజీత్ మార్క్ యాక్షన్ చిత్రం కనుక ఈ పాట అందుకు తగ్గట్లుగానే ఉంది.     

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ఓజీ విడుదల కాబోతోంది.