విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన రమ్య అనే ఒక మహిళ కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య తీవ్రంగా ఉందని, ఇండస్ట్రీలో తన స్నేహితురాలు ఒకామె విజయ్ సేతుపతి వలన చాలా ఇబ్బంది పడిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

దానిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ, “నేను ఎటువంటి వాడినో సినీ పరిశ్రమలో ఉన్నవారందరికీ తెలుసు. కానీ నాపై ఇటువంటి ఆరోపణలు రావడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా బాధ పడ్డారు. 

కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో ఆరోపిస్తే బాధపడటం దేనికి?బహుశః ఆమె నాపై ఇటువంటి ఆరోపణ చేయడం ద్వారా పాపులర్ అవ్వాలనుకుంతున్నారేమో?కనుక ఈ ఆరోపణని పట్టించుకోవద్దని నా కుటుంబ సభ్యులకు చెప్పాను. 

కానీ నా ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా నాపై ఇటువంటి ఆరోపణ చేసినందుకు ఆ మహిళపై చట్టబద్దంగా నోటీస్ పంపించి తగు చర్యలు తీసుకుంటాను,” అని విజయ్ సేతుపతి చెప్పారు. 

విజయ్ సేతుపతిపై ఈ ఆరోపణ చేసిన మహిళ కొద్ది సేపటికే ఆ పోస్టుని డిలీట్ చేసింది. ఆవేశంతో ఆ పోస్ట్ పెట్టానని కానీ దాని వలన తన స్నేహితురాలికి ఇబ్బంది కలుగుతుందని గ్రహించి డిలీట్ చేశానని ఆమె చెప్పారు.